ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆధిపత్య రాజకీయాల్లో ఉపాంత వర్గాల పాత్ర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

రాజకీయ ప్రయోజనం, ముఖ్యంగా ఎన్నికల మీద ఆధారపడే ప్రజాస్వామ్యంలో వైపరీత్యాలు ద్యోతకం అవుతాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి తరచుగా సైద్ధాంతికంగా మాట్లాడతారు. అలాంటప్పుడు రాజకీయ ప్రయోజనం అసంబద్ధంగా కనిపిస్తుంది. ఒకరి తరవాత మరొకరు అధికారంలోకి రావడం, అది గతి శీలం కావడంవల్ల అధికారంలో ఉన్న నాయకులూ మారుతూ ఉంటారు. గతి శీలంగా ఉన్నందువల్ల ఏదో ఒక అంచున ఉన్నారనుకునే వారూ అధికార కేంద్రంలో భాగం కావచ్చు. అధికారంలో ఉన్న వారు పెద్ద నిచ్చెన మీంచి కిందకు జారిపోవచ్చు. ఎన్నికల మీద ఆధారపడ్డ ప్రజాస్వామ్యం ఈ పరిణామానికి తోడ్పడుతుంది. మరో రకంగా చెప్పలంటే ప్రజాస్వామ్యంలో ఏదో అంచున ఉన్న వాళ్లు ఎప్పుడూ అక్కడే స్థిరంగా ఉండిపోక పోవచ్చు. వారికీ అధికార కేంద్రానికి చేరుకునే అవకాశం వస్తుంది. అయినా భారత ప్రజాస్వామ్యంలో ఏదో ఒక మూలన ఉన్నవాళ్లు అలాగే ఉండిపోతున్నారు. అసమాన సంబంధాల కారణంగా కేంద్ర స్థానంలో లేని వారు బలపడి సుస్థిరంగా అధికారంలో ఉండిపోవచ్చు. దాన్ని కనీసం కొన్నేళ్ల పాటు నిలబెట్టుకోవాలని ప్రయత్నించవచ్చు.

ప్రస్తుతం ఈ అధికార కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. దేశంలో రాజకీయాలను శాసిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షం కేవలం ప్రతిక్రియాత్మకంగా వ్యవహరించడానికే పరిమితమైంది. ఇలాంటి స్థితిలో ఏదో ఒక అంచున ఉండే పార్టీలు లేదా చిన్న పార్టీలు రెండు విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు విధానాలూ భిన్నంగా కనిపించవచ్చు కాని సార రూపంలో ఒకటే. బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగమైన చిన్న పార్టీలు కేంద్ర స్థానంలోకి రావాలన్న ఎజెండాను వదిలిపెట్టి కీలకమైన అంశాలలో స్వతంత్ర వైఖరిని అనుసరించలేకపోతున్నాయి. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తామనుకునే చిన్న పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అవి తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ పార్టీలుగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ పార్టీలు నిజంగా ఒక మూలన ఉన్నాయా? కేవలం ఎన్నికల రాజకీయాల దృష్టితో చూస్తే ఈ పార్టీలు ఏదో ఒక మూలకు పరిమితమైనట్టు కనిపించవచ్చు. కానీ నికర రాజకీయాలలో అవి కేంద్ర స్థానంలోనే ఉంటాయి. ఇవి కేంద్ర స్థానంలో ఉండడం వెనక, అర్థ ప్రకాశంగా ఉండడానికి జ్యోతీ రావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ లాంటి వారి ఆలోచనాత్మక విధానాన్ని పరిశీలించాలి. ఇలాంటి ఆలోచనాపరులవల్ల ఉపాంతంగా ఉన్నట్టు కనిపించే ఈ పక్షాలకు మేధా సంపత్తి దన్ను ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే సమాజంలోని సంపన్న వర్గాలకు ఫూలే, అంబేద్కర్ ఆలోచనా ధోరణితో ప్రయోజనం ఏమీ లేదు. ఆ వర్గం ప్రధానంగా సంపన్నులనే సమీకరిస్తుంది కాని మిగతా వారి మద్దతు కోసం కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏదో మూలన ఉండే ఈ పక్షాలు కూడా ఎన్నికల దృష్టితో చూస్తే కేంద్ర స్థానానికి రావచ్చు. ఈ పక్షాలకు సృజనాత్మక ఆలోచనా ధోరణి ఉన్నా, రాజకీయాల్లో పరిణామాత్మక మార్పు తీసుకు రావడానికి అవకాశం ఉన్నా విఫలం అవుతూ ఉంటాయి. ఆధిపత్యం చెలయించే పక్షాలు తిమ్మిని బమ్మి చేయడంతో సహా, దురుసుగా వ్యవహరించి ఆధిపత్యాన్ని ఎదిరించే వారి ప్రయత్నాలను వమ్ము చేస్తుంటాయి. అయితే ఈ పక్షాలు ప్రాంతీయంగా పరిగణనలోకి తీసుకోవలసినవిగానే ఉంటాయి.

ఈ శక్తులు ప్రయోజనం పొందాలంటే ఊర్ధ్వ దిశగా ఎదగడంతో పాటు దేశమంతా జన సమీకరణ చేసినప్పుడే ఫలితం ఉంటుంది. ఏదో ఒక మూలన ఉండే పక్షాలు తమ పరిధిని విస్తరించడానికి అవకాశాలు లేని సామాజిక వర్గాలను సమీకరిస్తుంటాయి. అలాంటి నాయకులు ఒక మూల నుంచి మరో మూలకు వెళ్తూ ఉంటారు. దళిత, ఇతర వెనుకబడిన తరగతుల వర్గాలలో అంతర్గత బృందాలు, ఇతర పక్షాలతో కలిసే బృందాలూ ఏర్పడుతుంటాయి. ఏదో ఒక మూలన పడి ఉండకుండా ఉండే ప్రయత్నం చేస్తాయి. ఆధిపత్య రాజకీయాలు చెలాయించే పక్షాలు ఏదో ఓ మూలన పడి ఉండే పక్షాలపై నుంచి ఒత్తిడి తీసుకొస్తాయి. ప్రస్తుత పరిస్థితిలోనూ, గతంలోనూ ఇదే పరిస్థితి. దానివల్లే మూలన ఉండే పక్షాలు ఆధిపత్యం చెలాయించే పక్షాలలో భాగం అవుతాయి. అదే విధంగా ఈ పక్షాల నాయకులు ఇందులో భాగం అవుతాయి. తమ అస్తిత్వం కోసం పాటు పడతాయి. ఈ పక్షాలు తమ సామాజిక అస్తిత్వం నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ఒక కారణం ఉంటుంది. ఇవి ఊర్ధ్వ దిశగా ఎదుగుతున్నట్టు కనిపించినా వాస్తవంగా ఆ ఎదుగుదల ఉండదు. అందుకే చిన్న పార్టీలు ఆధిపత్యం చెలాయించే స్థితికి రావు. ఆధిపత్యం చెలాయించే పక్షాలకు చిన్న పక్షాలను చేరదీయాల్సిన అవసరం ఉంటుంది. పైగా ఆధిపత్యం చెలాయించే పక్షానికి ఎన్నికల మీద ఆధారపడిన ప్రజాస్వామ్యంలో ఈ ఉపాంత వర్గాలను కూడా చేర్చుకోవలసిన అగత్యం ఉంటుంది. వైపరీత్యం ఏమిటంటే ఈ ఉపాంత పక్షాలకు ఆలోచనా విధానం ఉన్నప్పటికీ కేంద్ర స్థానానికి వెళ్లలేక పోతున్నాయి.

Back to Top