ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఎన్నికల బాండ్ల డొల్లతనం

.

ఎన్నికల నిధులు సేకరించడం కోసం ఉద్దేశించిన బాండ్ల విషయంలో ఇప్పుడు గగ్గోలు ఎందుకు మొదలైంది? అధికార పార్టీ అయిన బీజేపీ అనేక చట్టాలను ఉల్లంఘించి ఈ బాండ్లను ప్రవేశపెట్టిందని మనకు తెలియదా? 2017 మే 27వ తేదీన ఎన్నికల కమిషన్ న్యాయ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఆర్థిక చట్టాలను సవరించడంవల్ల అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బును చెలామణిలో పెట్టే అవకాశం వస్తుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. 2017లోనే రెండు పౌర సమాజ సంస్థలు చట్టాలను సవరిస్తూ ద్రవ్య బిల్లులను ప్రవేశపెట్టడంవల్ల ఎన్నికల నిధులు సమకూర్చడానికి వెసులుబాటు కలిగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించాయి. ఈ చట్టపరమైన చర్యలు గౌరవనానికి భంగం కలిగిస్తాయని, ఇవి అత్యున్నత సంస్థలు చెప్పిన రాజ్యాంగ సూత్రాలను వక్రీకరించడం అని మనకు తెలియలేదా? ఈ పద్ధతలు రాజకీయ వ్యవస్థలోని మౌలిక అంశాలను దెబ్బతీస్తాయని మనకు అవగతం కాలేదా?

సర్వ వ్యాప్తమైన ఎన్ని అనుమానాలున్నప్పటికీ ఎన్నికల బాండ్లు అస్తిత్వంలోకి వచ్చేశాయి. "ఎన్నికల నిధుల సమీకరణలో దాపరికం లేని విధానం" పేర అధికారంలో ఉన్న ప్రభుత్వం వీటిని చెలామణిలోకి తెచ్చింది. ఈ నిధులు "మకిలి అంటనివి" అని ప్రచారం చేసింది. "దాతలు గుప్తంగానే ఉంటారు" అని చెప్పింది. కానీ విపరీతంగా ప్రచారంలో పెట్టిన ఈ వాదనలన్నీ అసంబద్ధంగానే తేలాయి. ఒక వేళ దాపరికం లేకుండా ఉండాలంటే దాతలెవరో గుప్తంగా ఎందుకు ఉండాలి? దాతల పేర్లు రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటి? అవినీతి విషయానికే వస్తే అది ఇచ్చిపుచ్చుకోవడంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు రహస్యంగా ఉంటే అది ప్రభుత్వాధికారులకు, ప్రైవేటు ఏజెంట్లకు మాత్రమే తెలిసే విషయమైతే అందులో దాపరికం ఉన్నట్టే. నిగూఢంగా మిగిలిపోయినట్టే. ఆ లెక్కన నల్ల ధనం గుట్టు రట్టు చేస్తామన్నది హుళక్కే కదా!

కచ్చితమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ప్రజలు నిఘావేసే అవకాశం లేకుండా పోతోంది. ప్రభుత్వ వాదనలను పరాస్తం చేస్తూ హఫ్ పోస్ట్ వెలువరించిన కథనాలు అసలు బండారం బయట పెట్టాయి. ఎన్నికల నిధులు సమీకరించడంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమేనని తేలింది. అయితే ఈ సాక్ష్యాధారాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించే పరిధి దాటి వెళ్తాయా అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో పోటీని ప్రభుత్వం వమ్ము చేస్తోందా అన్న ప్రశ్న తలెత్తాలి. ఈ ఆందోళనకు అనేక కారణాలున్నాయి.

మన దేశంలో ఎన్నికల మీద ఆధారపడిన ప్రజాస్వామ్యంలో అధికారం చేపట్టడంలో డబ్బే ప్రధాన పాత్ర నిర్వహిస్తోంది. రాజకీయ ఆదర్శాలకు, విధాన పరమైన ప్రతిపాదనలకు ఏ మాత్రం విలువ లేకుండా పోతోంది. దీని పర్యవసానంగా రాజకీయ ప్రత్యర్థులు గడ్డు స్థితిలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడవలసి వస్తోంది. ప్రతిపక్షాలు వాడే భావగర్భితమైన భాషవల్ల ప్రయోజనం లేదు.

 

చారిత్రకంగానే మన దేశంలో ప్రత్యేక బేరర్ బాండ్లు విడుదల చేయడం గతంలో సంపాదించిన డబ్బుకు ఆధారాలు చూపకుండా బహిరంగంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించింది. "స్వచ్ఛందంగా ఆదాయాలను బయటపెట్టే" పథకంవల్ల నల్ల డబ్బు చెలామణిలోకి వచ్చి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లింది. ఇలాంటి పథకాలలో సహజంగానే ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహూకరణల మీద పన్ను ఉండదని హామీ ఉంటుంది. ఆ మధ్య యు.పి.ఎ. ప్రభుత్వం తమకు విరాళాలు ఇచ్చే వారు ఎవరో తెలియకుండా ఎన్నికల నిధుల కోసం ట్రస్టులు ఏర్పాటు చేసింది. వారి పేర్లు బయటపడకుండా చూసింది. నల్ల ధనం పోగేసే వారికి ఇలాంటి సదుపాయాలు కల్పించడంవల్ల ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నికల బాండ్లతో మాయ చేసిందని దుయ్యబట్టే అవకాశం తగ్గుతుంది.

పైగా అధికార పార్టీ "విదేశీ వర్గాల" నుంచి అందిన నిధులకు 2010నాటి విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం కింద మునుపటి తేదీ నుంచే అమలు చేసినందువల్ల, 1976 నాటి విదేశీ విరాళాల చట్టాన్ని రద్దు చేసి 2016, 2018 నాటి ఆర్థిక చట్టాలను వర్తింప చేసినందువల్ల అధికార పార్టీకి ప్రత్యర్థి పక్షాలకు కూడా ఊరట కలిగింది. ఉదాహరణకు భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూడా అక్రమంగా విదేశీ నిధులను వేదాంత నుంచి పొందాయని ప్రజస్వామ్య సంస్కరణల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో దిల్లీ హైకోర్టు చెప్పింది. ఎఫ్.సి.ఆర్.ఎ. ప్రతిపక్షాలకు ఉపకరించినట్టయితే ప్రభుత్వం తీసుకున్న చర్యను ఎందుకు సమర్థించకూడదు?

ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రభుత్వానికి బలమైన దురుద్దేశం ఉన్నా ఫలితం ఏమీ ఉండదు. అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విడుదల చేసిన ఎన్నికల బాండ్లపై అంతగా ఆందోళన పడడం లేదు. అయితే తగిన సాక్ష్యాధారాలు కనిపించినందువల్ల ఎన్నికల ప్రక్రియలో దాపరికం లేని తత్వానికి విఘాతం కలిగించారన్న నిందను ప్రభుత్వం భరించినా ప్రభుత్వం సిగ్గు పడే అవకాశం కనిపించడం లేదు.

మన దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచే అవకతవకలతో కూడి ఉంది. మునుపటి ప్రభుత్వం పాల్పడిన అవకతవకలకే ఈ ప్రభుత్వమూ పాల్పడితే ఈ ప్రభుత్వానికి తేడా ఎమీ ఉండదు. దాపరికం లేని ప్రభావం రాజకీయ పార్టీల బాధ్యతాయుత నడవడికపై వాస్తవంలో ప్రత్యక్షంగా గోచరించదు. ఎందుకంటే దాపరికం లేకపోవడం అనేక అంతరువుల్లో, స్థాయుల్లో ఉంటుంది. ఆ దృష్టితో చూసినట్టయితే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల బాండ్ల విషయంలో ఏదో ఒక స్థాయిలో దాపరికం ఉండే విధానాన్ని అనుసరించినట్టే.

అస్పష్టమైన, దాపరికం లేని తత్వం వ్యవస్థాగతమైన "బాధ్యతాయుత" నడవడికకు ఉపకరించదు. కేవలం బాధ్యాతాయుతంగా మెలగడంవల్ల అక్షరాలా బాధ్యతాయుతంగా నడుచుకున్నట్టు కాదు. సభ్య సమాజ సంఘాలు సమాచార హక్కు, దాపరికం లేని విధానం ఉండాలంటాయి. అయితే కచ్చితమైన బాధ్యతాయుత నడవడిక వ్యవస్థకు సంబంధించిన అంశం. అది కేవల దాపకరికం లేని తత్వానికి మించింది. అది ప్రభుత్వ స్వభావం మీద, సభ్య సమాజం సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

 

Back to Top