ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆత్మ పరిశీలన లేని టీవీ చానళ్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగిన సమయంలో పుల్వామా పరిణామాల గురించి పత్రికలు, ఎలెక్ట్రానిక్ మీడియా పక్షపాత ధోరణితో సమాచారం అందించినందువల్ల చాలా మంది తాము టీవీ చూడడమే మానేశామంటున్నారు. అంటే ఈ ప్రసారాలవల్ల ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. వారు హేతుబద్ధంగా ఆలోచించనివ్వకుండా చేస్తున్నారు. కొన్ని చానళ్లు ఉపయోగించే హాష్ టాగులు ప్రజలను బెదరగొడ్తున్నాయి. వీటిని ఉపయోగించడంలో సంపాదక నైతికత ఏమిటి? హాష్ టాగ్ ఉపయోగిస్తే ఒక అంశం గురించి జనానికి తెలుస్తుందని, వెబ్ లో కూడా తమ చానల్ ఉందని చెప్పడానికి ఉపకరిస్తుందని కొందరు వాదిస్తారు. అయితే ఆ ఉద్దేశంతో వాడితేనే ఆశించిన ప్రయత్నం ఉంటుంది. కానీ ఈ చానళ్లు ప్రచారానికే హాష్ టాగ్ వినియోగించుకుంటున్నాయి. తద్వారా మూడు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. హాష్ టాగ్ కు రాజకీయ ఉద్దేశం కల్పించడం, మూడు పార్శ్వాల పాత్ర నిర్వర్తించడం, ఒక నిర్దిష్ట భావనతో ఉన్న అంశాన్ని చూడమని ప్రేక్షకులను ప్రేరేపించడం. తీవ్ర వాదోపవాదాల్లో భాగస్వాములు కావాలని చెప్పడం.

ఈ రకమైన టీవీ ఆంకర్లు ఉదారవాద భావనలను ఖండిస్తారు. ఈ ఆంకర్లు, ప్రభుత్వం చెప్తున్నదానికన్నా జాతీయవాదం విస్తృతమైందన్న వాదనకు అవాకాశం ఇవ్వడం లేదు. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని అట్టహాసంగా టీవీల్లో చూపించి ఇతర సమస్యల నుంచి జనం దృష్టి మళ్లిస్తున్నారు. ప్రజలు ఆలోచించవలసిన మరో సమస్య ఏమీ లేదన్నట్టు చేస్తున్నారు. దేశ భద్రత కావాలంటే యుద్ధం చేయడం ఒక్కటే మార్గం అన్న అభిప్రాయాన్ని ఈ ఆంకర్లు కలగజేస్తున్నారు. దీనివల్ల పేదలు, నిరుద్యోగులు, అనాధలు, కష్టాల్లో ఉన్న రైతుల మీద విపరీతమైన నైతిక ఒత్తిడి ఉంటుంది. వారు కేవలం దేశ భద్రత గురించే ఆలోచించాలన్నట్టుగా ఉంటుంది. ఈ ఒత్తిడి సంపన్న వర్గాల మీద మాత్రం ఉండదు. వారు తమ సంపదతో హాయిగా ఉంటారు.

ఈ టీవీ చానళ్లు సామాన్య ప్రజల్లో ఉద్రేకాలు రెచ్చగొడ్తాయి. దానితో సామాన్య ప్రజలు సైన్యం శత్రువుకు అపార నష్టం కలగజేయాలని ఆశించారు. మన వైమానిక దళ దాడిలో ఎంత మంది తీవ్రవాదులు మరణించారో తెలుసుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించారు. అంటే కేవలం విదేశీ దాడి మీదే దృష్టి నిలిపేట్టు చేసి, సవ్యమైన ప్రశ్నలు లేవనెత్తే వారి నోళ్లు మూయించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఈ టీవీ చానళ్లు పసందుగా తోడ్పడ్డాయి.

సామాన్య ప్రజానీకంలో ప్రతీకార కాంక్షను ప్రభుత్వం యుద్ధ పిపాస సంతృత్పి పరుస్తుంది. పేదలు సైతం దీని బారిన పడ్తుంటారు. ఎందుకంటే "శాంతి" నెలకొని ఉన్నప్పుడు ప్రజలు దేశంలోపలి శక్తుల మీద తమ ఆగ్రహం వెళ్లగక్కుతారు. అందువల్ల పొరుగుననో, సరిహద్దులోనో ఒక శత్రువు ఉండడం ఇలాంటి వారికి ఉపకరిస్తుంది. దీన్నే టీవీ చానళ్లూ వాటంగా వినియోగించుకుంటాయి. ఈ చానళ్లు తాము వక్రీకరణకు పాల్పడడం లేదని, లేని వార్తలు కల్పించి చెప్పడం లేదని వాదిస్తాయి.

అయితే కొన్ని టీవీ చానళ్లు బయటికి కనిపించే నడవడికలో, వారికి ఉన్న ఆలోచనకు, దాన్ని వ్యక్తీకరించడంలో తేడాలు ఉంటాయి. ఒక టీవీ చానల్ శాంతి సామరస్యాలు కొనసాగడానికి అనువుగా ఉంటే అలాంటి భావాలను అణచి వేయవు. అయితే ఇవి ఇతర భావాలను అంగీకరించకపోవచ్చు. టీవీ చానల్ భావన ఏమిటి, వ్యక్తీకరణ ఎనా ఉంది అన్నదాన్నిబట్టి తమ ఆంకర్లు హేతుబద్ధంగా వ్యవహరించేట్టు చూడాలి. జాతీయతావాదాన్ని భుజాన వేసుకోకుండా ఉండాలి. విద్వేషాన్ని, అభద్రతా భావాన్ని  రగిలించకూడదు. సమాజంలో సామరస్యం కొనసాగేలా ఉండాలి. టీవీ లు మానవ విలువలకు భంగం కల్గించడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అయితే ప్రశ్నార్థకంగా ఉన్న టీవీ చానళ్ల భావనకు, వ్యక్తీకరణకు మధ్య పొంతన ఉండడం లేదు. ఈ అసంబద్ధతలో రెండు పార్శ్వాలున్నాయి. మొదటిది తమ చానల్ కు రేటింగ్ పాయింట్లు ఎక్కువగా ఉండాలన్న ఒత్తిడి ఉంటుంది. రెండవకారణం దురుసు కాకపోయినా మితి మీరిన ఆత్మ విశ్వాసం కారణం కావొచ్చు. కొంత మంది తాము ఏం చేస్తున్నామన్న నైతిక ప్రశ్న వేసుకోరు. ప్రభుత్వం కన్నా తాము భిన్నమని అనుకుంటే ఆత్మ పరిశీలనకు అవకాశం ఉంటుంది. కానీ టీవీ చానళ్లకు, ప్రభుత్వానికి మధ్య సంబంధం పరస్పరం తోడ్పడేదిగా ఉంటే ఈ ప్రశ్నే వేసుకోరు.

Back to Top