ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉద్యోగాలు పెరిగితేనే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

రిజర్వేషన్ల జాబితాలో కొత్తగా కొన్ని కులాలను చేర్చాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు ఆసక్తికరమైన దశకు చేరుకున్నాయి. రిజర్వేషన్లు ఓ కళంకం అన్న భ్రాంతి తొలగించడం ఈ కోర్కెల ఆశయం. అదే సమయంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వీటిని విరూపం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాల కింద రిజర్వేషన్లు పొందే వారిని, ప్రధానంగా షెడ్యూల్డు తరగతుల వారిని అత్యంత పరుషుమైన భాషలో "ప్రభుత్వానికి అల్లుళ్లు" అని అనైతిక రీతిలో నిందించారు. అంటే వీరికి నిర్హేతుకంగా రిజర్వేషన్లు  కల్పిస్తున్నారన్నది వారి ఆక్రోశం. రిజర్వేషన్లు పొందే వారు "ప్రతిభకు శత్రువులు" అని కూడా దుయ్యబట్టారు. సమర్థంగా పని చేయడానికి ఇవి అడ్డంకి అన్నారు. నిర్దిష్ట సామాజిక వర్గాలకు చెందినవారే ఈ రకమైన అపనిందలు వేశారు. వ్యవస్థ సుభిక్షంగా ఉండాలంటే ప్రజలకు మేలు జరుగుతుందన్న మిషతో రిజర్వేషన్ల విధానాన్ని మొత్తంగా వ్యతిరేకించకపోయినా ఒక నిర్దిష్ట వర్గానికి ఆ సదుపాయం కల్పించడంపై ద్వేషం వ్యక్తం చేశారు. అయితే ఈ విద్వషం ఒక వ్యక్తికో, ఒక సమూహానికో వ్యతిరేకమైంది అని చెప్పకుండా సమాజ శ్రేయస్సుకు భంగం కలిగిస్తుందని చెప్పారు. రిజర్వేషన్లు లేకుండానే ప్రభుత్వ వ్యవస్థలలో ప్రతిభను, సామర్థ్యాన్ని పెంపొందింప చేయవచ్చునని వాదించారు. మండల్ వ్యతిరేకోద్యమంలో జరిగింది ఇదే.

కొత్తగా కొన్ని కులాలను రిజర్వేషన్ల జాబితాలో చేర్చాలని ఉద్యమాలు జరుగుతున్న ప్రస్తుత స్థితిలో రిజర్వేషన్ల వ్యతిరేకులు "ప్రతిభ", "సమర్థత" లాంటి మాటలు అంతగా వాడడం లేదు. అయినా నర్మగర్భంగా, సామాజిక మాధ్యమాలలో రిజర్వేషన్ల వ్యతిరేకత దుర్మార్గమైన రీతిలో కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్లను వ్యతిరేకించడం ఇప్పుడు ప్రతిభ, సామర్థ్యం కారణాలవల్ల కాకపోయినా సమాజం ఐక్యం కాకుండా చేయడం, దేశాభివృద్ధికి అడ్డుపడే స్థాయిలో ఉంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంవల్ల కులతత్వం కొనసాగుతుందని, కుల నిర్మూలన జరగదని అంటున్నారు. అయితే రిజర్వేషన్ల వ్యతిరేకులు ప్రతిభ, సమర్థ్యం గురించి అంతగా ప్రస్తావించకుండా ఎందుకు మాట్లాడుతున్నారో గమనించాలి.

మొదటి కారణం అసలు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగ కల్పనే తగ్గిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం తగ్గింది. ఒక వేళ ఉన్నా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రతిభ ఆధారంగా కాకుండా సైద్ధాంతిక నిబద్ధత ఆధారంగా సాగుతోంది. రెండవది రిజర్వేషన్లు సమాజ శ్రేయస్సుకు విరుద్ధమైనవని భావించే వారు అసలు రిజర్వేషన్లలోనే ఈ అంశాలు ఇమిడి ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని ఒప్పుకోవడమంటేనే రిజర్వేషన్ల కోసం ఉద్యమించడానికి కారణం అని గ్రహించాలి. ఇది రిజర్వేషన్లు కల్పించడమే ఎస్.సి.లకు మచ్చ అన్న వాదనకు అవకాశం లేకుండా పోయింది. అంటే రిజర్వేషన్ల కల్పన ప్రజాస్వామీకరణకు దోహదం చేస్తుందని దుర్నీతితో చేసే విమర్శలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇది మంచి సూచనే. ఇది సామాజిక ఉద్రిక్తతలను దూరం చేస్తుందని కూడా కొందరు భావించవచ్చు. మన దేశంలో కులఘర్షణలు మామూలే. ప్రభుత్వాలు కొత్తగా రిజర్వేషన్లు కావాలని కోరే వారికి అనుకూల నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదు.

రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల కోసమే ఆ పని చేస్తున్నారు తప్ప ఆయా కులాల సమీకరణకు కాదు. అయితే రిజర్వేషన్లు కోరుతున్న వారు ఉపాధి అవకాశాలు పెంచాలని కోరడం లేదన్న వాస్తవం గమనించాలి. ఇలా కోరకపోతే ప్రభుత్వాలు ఉద్యమాలను ఎదుర్కోవడానికి పెడదారి పట్టించే వెసులుబాటు కల్పించినట్టవుతుంది. న్యాయ వ్యవస్థను ఆసరాగా చేసుకుని కొత్త వర్గాలకు రిజర్వేషన్లు కల్పించకుండా తప్పించుకుంటాయి. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమాలే తీరే ప్రభుత్వాలు పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వాలు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడతాయి. ఉదాహరణకు మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూనే న్యాయస్థానాలు అడ్డుతగులుతున్నాయి అంటోంది. వివిధ రాష్ట్రాలలో కొన్ని వర్గాలను రిజర్వేషన్ల జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తున్న వారు ఉపాధి అవకాశాలు పెంచాలని కోరడం లేదు. రిజర్వేషన్లు కావాలంటున్న వారు వివిధ స్థాయుల్లో ఖాళీగా ఉన్న 24 లక్షల ప్రభుత్వోద్యోగాలను ముందు భరీ చేయాలని పట్టుబట్టాలి.

ఉపాధి అవకాశాలు పెంచాలని కోరకుండా తమ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరితే ఆకాంక్షలు పెరగడం, ఒత్తిడి పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు. వ్యవసాయం మీదా ఆధారపడ్డ ఉత్తర భారత్ లోని జాట్లు, పశ్చిమ ప్రాంతంలోని పాటీదార్లు, మరాఠాలు, దక్షిణాదిలోని కాపులు వ్యవసాయం లాభసాటిగా లేదని భావిస్తున్నారు. చదువుకోవడమే మేలు అనుకుంటున్నారు. కాని తాము విద్యా రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినందువల్ల ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా ఉన్న అవకాశాలు నామ మాత్రం కావడంవల్ల నిరాశకు గురవుతున్నారు. కొత్తగా రిజర్వేషన్లు కోరుతున్న వారు మరిన్ని ప్రభుత్వోద్యోగాలు అందుబాటులో ఉంటేనే ప్రయోజనం ఉంటుందని గ్రహించాలి.

Back to Top